సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చిరంజీవి కూతురు అయిన సుస్మిత..కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది. సైరా సినిమా దగ్గర నుంచి చిరంజీవికి సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. అలాగే మరోవైపు సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాత సంస్థను స్థాపించింది. తన బ్యానర్ లో సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాలను నిర్మించింది.
ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, సుస్మిత ఇప్పుడు తన బ్యానర్ లో చిరంజీవి సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. కళ్యాణ్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన తండ్రి చిరుపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏది అంత ఈజీగా ఉండదు. ప్రతిరోజు పోరాటం చేయాలి. వర్క్ ని ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. చాలా మంది తనను నెపోటిజం పేరుతో విమర్శించారు.. వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం.. అందకే విమర్శలను నేను అస్సలు కేర్ చేయను అంటూ సుస్మిత చెప్పుకొచ్చింది. ఇక `మా నాన్న సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలో చాలా కఠినంగా ఉంటారు. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అంతే. నేను కూతుర్ని కాబట్టి సాఫ్ట్ గా ఉండడం లాంటిది ఏమీ ఉండదు. నచ్చకపోతే నిర్మొహమాటంగా ముఖంపైనే చెప్పేస్తారు` అంటూ సుస్మిత పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.