ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియన్` మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇన్నేళ్లకు ఈ మూవీకి సీక్వెల్ గా శంకర్ కమల్ హాసన్ తో `ఇండియన్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకులను దాటుకుని ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. తాజాగా మేకర్స్ ఇండియన్ 2 డిజిటల్ రైట్స్ ను విక్రయించారట.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పోటీ పడి మరీ ఇండయన్ 2 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అది కూడా రికార్డు ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని అంటున్నారు. ఇండియన్ 2 మూవీ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.220 కోట్లకుపైగా చెల్లించి దక్కించుకుందట. ఇదే నిజమైతే.. రికార్డు డీల్ గానే దీనిని చెప్పుకోవాలి. ఇక ఇండియన్ 2 ఆడియో రైట్స్ ను సరిగమ సంస్థ రూ. 23 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా విడుదలైకు ముందే ఈ మూవీకి నలభై కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయని అంటున్నారు.