ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం.
ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ కృష్ణవంశీ ,రాఘవేంద్రరావు, ఈవివి సత్యనారాయణ ఇలా చాలామంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ఒక చిత్రానికి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది.ఆ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. ఈ చిత్రం 1996లో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కు చాలా సన్నివేశాలను రవితేజ వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత నటుడుగా రవితేజ బిజీ అయిపోయారు. దర్శకత్వం వైపు మక్కువ ఉన్న ఆ వైపు చూడలేదట. అలాగే ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.
మరొక హీరో నాని మొదటిలో డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర కూడా పనిచేశారు.. డైరెక్టర్ మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మ సినిమాతో హీరోగా మారారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని మంచి హీరోగా నిలదొక్కుకున్నారు.నాని ఇటీవలే దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించారు.