మెగాస్టార్ చిరంజీవి తర్వలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రామేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా గురువారం భోళా శంకర్ ట్రైలర్ ను లాంఛ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు చిరంజీవి పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. అలా అని ఆయన ఈ సినిమాను ఊరికే చేస్తున్నాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అనంతరం చిరు నుంచి రాబోతున్న సినిమా ఇది. భోళా శంకర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో జరుగుతోంది. పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద భోళా భాయ్ దుమ్మురేపడం ఖాయం. అయితే ఈ సినిమాకు చిరు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో కొంత వాటాను తీసుకునేలా డీల్ కుదుర్చుకున్నారట. ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఒకవేళ సినిమా నెగటివ్ టాక్ తో డిజాస్టర్ అయితే.. లాభాలు కాదు కదా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా గగనం అవుతుంది. అప్పుడు చిరంజీవి చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. ఇటీవలె రవితేజ కూడా లాభాల్లో వాట కోసం ఆశపడి రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాల విషయంలో చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు చిరంజీవి అదే చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు గురూ.. రిస్క్ ఎందుకు రెమ్యునరేషన్ తీసుకుంటే పోలా అంటూ నెటిజన్లు చిరంజీవికి హితవు పలుకున్నారు.