రిచా పల్లోడ్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రిచా.. 2000 సంవత్సరంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ `నువ్వే కావాలి`తో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే పెద్ద హిట్ ను ఖాతాలో వేసుకుని అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రిచాకు ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిచా అనేక చిత్రాలు చేసింది.
కానీ, స్టార్ హోదాను అందుకోలేకపోయింది. కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా హిట్లు పెద్దగా పడలేదు. సక్సెస్ లేకపోవడం, కొత్త హీరోయిన్ల పోటీ గట్టిగా ఉండటంతో కొంత కాలానికే రిచా ఫేడౌట్ హీరోయిన్ల జాబితాలో చేరింది. దాంతో సినిమాలకు బ్రేకిచ్చిన ఈ భామ హిమాన్షు బజాజ్‌ను 2011లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2013లో ఓ కుమారుడు జన్మించాడు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ముంబైలో ఉంటోంది. అయితే రిచా ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్ అయిపోతారు. ఎందుకంటే, ఇరవై క్రితం ఎలా ఉందో.. ఇప్పుడు కూడా రిచా అలానే ఉంది. ఆమె అందం చెక్కుచెదరలేదు. అన్నట్లు రిచా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ కూడా షురూ చేసింది. ఈమె నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ `యువర్ ఆనర్` కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రిచా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే అనేక యాడ్స్ లో నటిస్తూ గట్టిగా సంపాదిస్తోంది.
View this post on Instagram