టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్.. తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ నుంచి ఆల్మోస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే వస్తున్నాయి.
అయితే ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. స్టార్ హీరోలకు చురకలు వేసింది. తనలాంటి చిన్న హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వరంటూ వారి పరువు మొత్తం తీసేసింది. కెరీర్ తొలినాళ్లలో కాకా ముట్టై చిత్రంలో తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. స్టార్ హీరోలు కూడా పొగడ్తల వర్షం కురిపించారు. కానీ, అలా పొడిగిన వారిలో ఏ ఒక్కరూ తమ సినిమాల్లో అవకాశం ఇవ్వలేదు. అలా ఆఫర్లు లేక ఏడాదిన్నర ఖాళీగానే ఉన్నానని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.
తన నటనపై ప్రశంసలు కురిపించిన పెద్ద హీరోలెవ్వరూ మళ్లీ తనవైపు కనెత్తి కూడా చూడలేదు. అందుకే నటిగా నిరూపించుకోవాలంటే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేయడమే బెటర్ అనిపించింది. అప్పటి నుంచి అలాంటి కథలపై ఫోకస్ చేశాను. అలా నా సినిమాలో నేనే హీరో అయ్యాను అంటూ ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ఐశ్వర్య రాజేష్ చేతిలో దాదాపు అరడజన్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే కావడం విశేషం.