సినిమాల రీరిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టమేనా..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తను నటించిన గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ బాగానే కలెక్షన్లు రాబడుతున్నారు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు సైతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆయన డేట్ లను సైతం అడ్జస్ట్ చేయండి అంటూ పలువురు దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నారు.కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యిందట. రీ రిలీజ్ సినిమాల విషయంలో పెద్ద సమస్య ఏర్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది కదా అని ఆయన పాత సినిమాలను సైతం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Pawan Kalyan: Unseen vintage pictures of the Powerstar | Times of India

కానీ ఏదైనా సరే మొదట ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉండడం లేదట. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలను ఇలా రిలీజ్ చేస్తూ పోతే గత కొన్ని సంవత్సరాలకు ఒక్క సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్ లో రిలీజ్ చేయడానికి మిగలదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో జల్సా, ఖుషి, తొలిప్రేమ, బద్రి ,తమ్ముడు ఇలా అన్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో కేవలం ఖుషి సినిమా మాత్రమే కలెక్షన్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది మిగతా సినిమాలకు కలెక్షన్లు భారీగానే తగ్గినట్లు సమాచారం.

Pawan Kalyan old days photos | Unseen with friends and besties | Allu Arjun  | Ram Charan - YouTube

రీ రిలీజ్ చేసిన జల్సా సినిమా రెండు కోట్ల రూపాయలు రాగా కృషి సినిమాకి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది. కానీ తొలిప్రేమ సినిమాకి కోటి రూపాయలు కూడా. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ పాత సినిమాల పైన అభిమానులకు ఆసక్తి తగ్గుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి పాత సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తు బాక్సాఫీస్ వద్ద అవమానం తప్పదు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రిలీస్ సినిమాలు ఆపేస్తేనే బెటర్ అంటూ సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.