త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య కి వరుణ్ తేజ్ అమ్మగారు పద్మ అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సాధారణంగా ఏ ఇంట్లో అయినా సరే అత్త – కోడలు అన్నాక గొడవలు పడడం చాలా కామన్. ప్రతి ఇంట్లో ఇదంతా జరిగేదే. అయితే అత్త.. మోడ్రన్ గా ఉండే కోడలికి ఎలాంటి కండిషన్స్ పెడుతుందో నేటి కాలం అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పనవసరం లేదు. జీన్స్ ప్యాంటు వేయొద్దని ..షర్ట్స్ వెయ్యొద్దు అని.. షార్ట్స్ ధరించొద్దు అని ..చీర కట్టుకోమని ..నువ్వు చేస్తున్న పనిని ఆపేయని ..ఇంటిపట్టున ఉండమని.. త్వరగా పిల్లల్ని కనేయమని ..ఏవేవో కండిషన్స్ పెడుతూ ఉంటారు .
అవి నచ్చని కోడళ్ళు – అత్తకు కూడా అలాగే ధీటైన జవాబు ఇస్తూ ఉంటారు . అయితే నేటి కాలం అత్తా కోడలికి పూర్తి విభిన్నంగా మారిపోయారు లావణ్య త్రిపాఠి – పద్మ. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కి అత్త ఫుల్ రైట్స్ ఇచ్చేసిందట . పెళ్లి తర్వాత సపరేట్ కాపురం పెట్టుకోండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పద్మ – నాగబాబు -లావణ్య త్రిపాఠి కి నచ్చినట్లు ఉండమంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారట.
సినిమాలు చేసిన ప్రాబ్లం లేదు.. మోడరన్ బట్టలు వేసుకున్న అభ్యంతరం లేదు.. కానీ లిమిట్స్ లో ఉండమంటూ మటుకు చెప్పారట . మెగా ఇంటి పరువు తీయకుండా ఎలాంటి పని చేసిన ప్రాబ్లం లేదు అంటూ ఫుల్ పచ్చజెండా ఊపేసారట. తన కూతురు నిహారికకు అత్తగారింట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయో.. అవి ఇక్కడ లావణ్య త్రిపాఠికి రాకుండా అత్తగారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట . మొత్తానికి ఒక కోడలు అత్త దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది పూర్తిగా ఫుల్ ఫిల్ చేయడానికి సిద్ధమయింది పద్మ. మరి చూడాలి కోడలిగా లావణ్య త్రిపాఠి తన బాధ్యత ఎలా నెరవేరుస్తుందో..?