హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!

థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు థమన్ కెరీర్ ను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు, త్రివిక్రమ్ చేస్తున్న సినిమా గుంటూరు కారం. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకి, థమన్ కి గొడవలు మొదలయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో త్రివిక్రమ్ థమన్ ని ఈ సినిమా నుంచి తప్పించి జీవీ ప్రకాష్ కుమార్ ను తీసుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు బ్రో మూవీకి థమన్ 3.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఇతర ఖర్చుల కోసం నిర్మాతకు మరో 60 లక్షల రూపాయల బిల్ పంపించారని, అయినప్పటికీ బ్రో సినిమాకు సంబంధించిన ఒక ట్యూన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది

. ఈ వార్తలు విన్న థమన్ కొంచెం ఘాటుగానే బదులిచ్చారు. నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్ ను ప్రారంభిస్తానని థమన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కడుపుమంట సమస్యతో బాధ పడేవాళ్లు ఈ మజ్జిగ తాగి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. నా సమయాన్ని నేను వృథా చేసుకోవాలని అనుకోవడం లేదని చాలా పని ఉందని గుడ్ నైట్ చెబుతూ థమన్ ఆ ట్వీట్ ను ముగించారు. దీంతో ఇప్పుడు థమన్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.