`ఆదిపురుష్‌`లో రాముడితో పాటు ప్ర‌భాస్ పోషించిన మ‌రొక పాత్ర ఏదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` హంగామా మొదలైంది. ఫైన‌ల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ సీతగా న‌టిస్తే.. సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర‌ను పోషించాడు.

రామాయ‌ణం క‌థ అంద‌రికీ తెలిసిందే అయినా.. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ ఎలా మెప్పించాడు అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే రాముడిగా ప్ర‌భాస్ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను వంద శాతం అందుకున్నాడ‌ని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ బెనిఫిట్ షోస్ ప‌డ‌గా.. ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆదిపురుష్ ని తిరుగులేని చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ నటన అద్భుతం, విఎఫ్ఎక్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎవ‌రూ ఊహించ‌ని మ‌రొక స‌ర్‌ప్రైజ్ ఉంది. అదేంటంటే.. ఇందులో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. అవును రాముడితో పాటు మ‌రొక పాత్ర‌ను కూడా ఆయ‌న పోషించాడు. ఇంత‌కీ ఆ పాత్ర మ‌రేదో కాదు దశరధుడు. శ్రీ‌రాముడి తండ్రి దశరధుడు పాత్రలోనూ కనిపించి ప్ర‌భాస్ ఆక‌ట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.