ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే చాలా అంశాలపైన తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిత్యం నిలవాలని యత్నిస్తూ ఉంటాడు.
ఇక సోషల్ మీడియాని వర్మ వాడుకున్నట్టు ఎవరూ వాడుకోలేరనే చెప్పుకోవాలి. ఎప్పటి కప్పుడు అనేక విషయాలపై పోస్టులు పెడుతూ చాలామందికి గిల్లుతూ ఉంటాడు. ఇలా అనేక విషయాల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే వివాదాల దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఇక్కడ మాట్లాడుతూ… నేను 24 గంటల్లో కేవలం కేవలం 4 గంటలు మాత్రమే పడుకుంటాను. మిగతా 20 గంటలు అమ్మాయిలతో ఆడుకుంటాను అని చెప్పుకొచ్చాడు. దాంతో ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అది మాత్రమే కాదండోయ్, సోషల్ మీడియాలో ట్రోల్స్ ను గిల్లుతూ ఉంటానని, సమాజంలో బాగా పేరువున్నవారి మీద రాళ్ళూ విసురుతూ వారు ఫ్రస్ట్రేట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్న ఓ వర్గంవారు మాత్రం వర్మపైన తెగ విరుచుకుపడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గిల్లుతూ ఉంటానని వర్మ ఇక్కడ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. దాంతో పవన్ అభిమానులు వివాదాల వర్మని తిట్టి పోస్తున్నారు.