ఫస్ట్ వీక్:టాలీవుడ్ లోఅత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ అభిమానులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సినిమా పరంగా టాక్ బాగున్నట్లు వస్తే కలెక్షన్ల సునామి ఆ సినిమాలు సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. అలా మొదటి వారం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం.

Mahesh Babu, Prabhas, Ram Charan, Allu Arjun, and Jr NTR reveal their  crushes - TeluguBulletin.com

అలా మొదటి వారం అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో RRR చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. దాదాపుగా మొదటి వారం రూ 172 షేర్ కలెక్షన్లు కాబట్టి టాప్ లో ఉన్నది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ చిత్రాన్ని బీట్ చేయలేదు. ఇక ఆ తర్వాతి స్థానం బాహుబలి-2 ఉన్నది. రూ.107 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబట్టడం జరిగింది. మూడో స్థానంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా మొదటి వారంలో రూ.81 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.

ఇక ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమా రూ.76 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఆ తర్వాతి స్థానం చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా మొదటివారం రూ.75 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టింది. ఆదిపురు సినిమా నెగిటివ్ టాకు వచ్చినప్పటికీ మొదటి వారం రూ.73 కోట్ల రూపాయల షేర్ కలెక్షను రాబట్టి ఇంకా అవ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే లాంగ్ రన్ టైంలో కూడా ఈ సినిమా రూ .100 కోట్లు అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.