రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగె తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది.
అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా ఏడు వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే అనేక అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా భారీ నష్టాలు రాకపోయినా.. ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది.
స్ట్రీమింగ్ డేట్ కూడా అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆదిపురుష్ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రికార్డు ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 11 లేదా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వారు డిసైడ్ అయ్యారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందట. ఈమధ్య థియేటర్స్ లో విడుదల అయిన సినిమాలన్నీ నెల తిరక్క ముందే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కానీ, ఆదిపురుష్ ను మాత్రం టాక్ ఎలా ఉన్నాసరే రెండు నెలలకు స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం.