చిరంజీవితో హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఎవరు ఊహించని రిప్లై ఇస్తున్న యంగ్ బ్యూటీస్..!

మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ అంటే అబ్బా.. అంటున్న హీరోయిన్స్..? అవును ఇప్పుడు టాలీవుడ్ లెజండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తామంటే కొందరు హీరోయిన్స్ వెనకాడుతున్నారట. ఈ టాక్ ఈ మధ్యనే ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరు సరసన ఛాన్స్ కోసం ఎదురుచూసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమాలో చిన్న వేశం దొరికినా చాలనుకున్నవారున్నారు.

హీరోయిన్స్ మాత్రమే కాదు, మిగతా నటీనటులలోనూ ఇదే ఆరాటం ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్..ఇలా అందరూ అన్నయ్య సినిమాకు ఏదో ఒకరకంగా భాగమవ్వాలని ఆశపడినవారే..ఇంకా పడుతున్నవారే. ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ ఆయన అభిమానులే.. చేయబోతున్నవారూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవారే. అలాంటి వారికి దక్కే అదృష్ఠం హీరోయిన్స్‌కీ దక్కుతుంది.

కానీ, కొందరు యంగ్ బ్యూటీస్ చిరు పక్కన సినిమా అంటే ఏజ్ గ్యాప్ కారణంగా నో అంటున్నారట. అంతేకాదు, చిరు సినిమాని వదులుకున్నందుకు బాధపడుతూ కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్‌గా చేస్తే మళ్ళీ యంగ్ హీరోల పక్కన అవకాశం రాదేమో అని భయం. ఇంతకముందు కొంతమంది హీరోయిన్ ఇలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారి సరసన నటించి అడ్రస్ లేకుండా పోయారు.

Waltair Veerayya: Shruti Haasan shares her uncomfortable experience  shooting for 'Sridevi Chiranjeevi' song | Telugu Movie News - Times of India

నయనతార, శ్రియ, కాజల్ అగర్వాల్ లాంటి అతికొద్దిమందే ఈ ముసలి హీరోల పక్కన నటించినా కూడా అదృష్ఠం కొద్దీ ఇంకా స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్నారు. శృతిహాసన్ కూడా ఈ సంక్రాంతికి వచ్చిన చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలు తర్వాత మళ్లీ ఈ ముద్దుగుమ్మ మరో సినిమా ప్రకటించలేదు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత వరుస‌ సినిమాలతో బిజీగా మారిపోయాడు.

Chiranjeevi's Bholaa Shankar release date announced

ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల పరిస్థితి కూడా ఎంతో అగమ్య గోచరంగా మారింది. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా నటిస్తుంది.. అంతేకాకుండా కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా నటిస్తుంది. ఇప్పుడు ఇదే విషయం ఈ హీరోయిన్లను భయపడుతుంది.

Share post:

Latest