శివజ్యోతి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విరూపాక్ష నటుడు..

సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష సూపర్ హిట్ అయింది. యాక్టర్ల మంచి పర్ఫామెన్స్, గుండెల్లో దడ పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్‌, మంచి స్టోరీ లైను డైరెక్షన్ వల్ల ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాగా పేరు సంపాదించిన నటుడు ఒకరున్నారు. అతని పేరు రవికృష్ణ. విరూపాక్ష సినిమాకి ముందు రవికృష్ణ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ పేరు చాలామందికి తెలిసిందే తెలియని వాళ్లు కూడా అతను ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చెబుతున్నారు.

రవికృష్ణకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ షోలో తన మంచి మనస్తత్వాన్ని చాటుకున్న ఈ నటుడు విరూపాక్ష సినిమాలో నెగిటివ్ షేడ్స్ గల రోల్ పోషించి ఆశ్చర్యపరిచాడు. సినిమా తర్వాత మంచి పేరు రావడంతో అతనికి దగ్గరికి ఇంటర్వ్యూలు తీసుకునేందుకు మీడియా పర్సన్స్ ఎగబడుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

అసలు తనకు సినిమాలో అవకాశం వస్తుందని తాను ఊహించలేదని కానీ లుక్ టెస్ట్ చేసి విరూపాక్ష మూవీలో నటించే మంచి అవకాశాన్ని డైరెక్టర్ ఇచ్చారని రవికృష్ణ. తాను ఎప్పటినుంచో ఒక సక్సెస్ కోరుకుంటున్నానని, అది విరూపాక్షతో నెరవేరిందని పేర్కొన్నాడు. అసలు టీవీలో నటించే తనలాంటి వారికి సినిమాలో అంత పెద్ద రోలు ఎవరూ ఇవ్వరని కానీ డైరెక్టర్ కార్తీక్ సార్ మాత్రం తనను నమ్మిన ఈ అవకాశాన్ని అందించాలని చెబుతూ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచాడు.

ఇక ఈ సినిమాలోని హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి కూడా రవికృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమెను లక్కీ అని చాలామంది అంటుంటారు కానీ నిజానికి ఆమె ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందని ఈ సీరియల్ యాక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో తనకు మంచి ఫ్రెండ్ అయినా శివజ్యోతి గురించి కూడా ఈ నటుడు కొన్ని కామెంట్స్ చేశాడు. తమ ఇద్దరి మధ్య స్వచ్ఛమైన అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని రవికృష్ణ పేర్కొన్నాడు. శివజ్యోతి గురించి చెబితే తన కళ్లలో నీళ్లు వస్తాయని ఈ యాక్టర్ చెప్పడం విశేషం.

Share post:

Latest