ఒక సినిమా వస్తుంది అంటే చాలు అందులో పదుల్లో రొమాంటిక్ సీన్స్ ని జోడించడం, అర డజన్ కి పైగా ముద్దు సన్నివేశాలను పెట్టడం ఈ మధ్య వెరీ కామన్.అసలు ముద్దు సీన్స్ లేకపోతే సినిమా చూడటానికి కూడా ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉన్నారు. తీసేవారు అలాగే ఉన్నారు, చూసేవారు అలాగే తయారయ్యారు.కానీ నేటి తరం సినిమా పోకడకు కాస్త ముందు తరాల సినిమాలకు చాలా తేడా ఉంది.
అప్పట్లో ఒక ముద్దు సీన్ తీయాలంటే అటు హీరోను, ఇటు హీరోయిన్‌ను ఒప్పించడానికి దర్శకుడు చాలా కష్టపడేవాడు. 60, 70 వ దశకాల్లో ముద్దు సీన్ అంటే ఆకులను లేదా పువ్వలను అడ్డు పెట్టడం చేసి సీన్ రక్తి కట్టించేవారు. కానీ 80 , 90 వ దశకాల్లో పరిస్థితిలో మార్పు వచ్చింది.అప్పుడు బుగ్గ పైన, చెంప పైన ముద్దులు పెట్టుకోవడం అలవాటయ్యింది.ఇక 2000 సంవత్సరంలో మాత్రం లిప్ లాకులకు పెట్టింది పేరు.ఇక ఇప్పుడు అయితే అవి మరి ఘాడమైన ముద్దులు అనక తప్పదు.
ఇలా చేయడానికి నటీనటులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండటం లేదు. ముద్దు సీన్లు పెరిగితే రెమ్యునరేషన్ కూడా పెంచమని కండిషన్స్ పెట్టె రోజుల్లో ఉన్నాం. అంతలా సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. అయితే కాస్త ముద్దు సీన్స్ నడుస్తున్న సమయంలో అలంటి సీన్స్ పెడతాం అంటే సినిమా లేకపోయినా పర్వాలేదు ముద్దు సీన్లు చేయము అంటూ చెప్పి, గొడవ పడ్డ హీరోయిన్లు కొంత మంది ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మాళవిక :
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు, ఈ సినిమా టైంలో నటి కిరీటి గా పేరున్న రాజేంద్ర ప్రసాద్ తో చాల పెద్ద గొడవలే హరిగాయి మాళవికకి. అసలు ఆమె రాజేంద్ర ప్రసాద్ వల్లే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ టైం లో ముద్దు పెట్టమని ఇబ్బంది పెడుతూ, తనతో అసభ్యంగా నడుచుకున్నాడని చాలా పెద్ద రచ్చ చేసింది మాళవిక. అప్పట్లో అయన పెద్ద హీరో ఆమె ఒక అప్ కమింగ్ హీరోయిన్ కావడంతో అందరు ఆమెనే తప్పు పట్టారు.
జరీనా ఖాన్ :
గోపీచంద్ హీరో గా నటించిన చాణక్య సినిమాలో జరీనా ఖాన్ హీరోయిన్ గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు వివాదాలతో బాలీవుడ్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒక బాలీవుడ్ సినిమా హీరో తనతో ముద్దు రిహార్సల్స్ చేయాలనీ బలవంతం పెట్టాడని చెప్పి బాంబు పేల్చింది జరీనా. సరిగ్గా చాణక్య సినిమా టైంలో చెప్పేసారికి అందరు గోపి చంద్ గురించి అంటూ పుకార్లు సృష్టించారు. అయితే తెలుగు హీరోలు మంచి వారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
మీరా చోప్రా :
తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరా చోప్రా. తనను ఒక సినిమా షూటింగ్ లో ఒక హీరో బలవంతంగా ముద్దు పెట్టుకోవాలనే ప్రయత్నం చేశాడంటూ చెప్పిన మీరా ఆ తర్వాత మాట మార్చింది. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక పబ్లిసిటీ పిచ్చి అని అందరు అనుకున్నప్పటికీ ఆమెను ఎవరో బెదిరించడంతోనే మాట మార్చింది అని ఆ తర్వాత తెలిసింది.