త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న తెలుగు హీరో రామ్.. అభిమానుల్లారా గెట్ రెడీ..!!

గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఆయన పెళ్లి విషయంలో అనుకోని పొరపాటు పడేరు . కాదండోయ్… ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన విషయంలో రామ్ పోతినేని కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మనకు తెలిసిందే రామ్ పోతినేని ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుంది . మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు రామ్ పోతినేని అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా నుంచి పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్ ఫిక్స్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

అంతేకాదు ఇప్పటికే ఆ టీజర్ ని కూడా రెడీ చేసేసారట . ఇప్పటివరకు తన కెరియర్ లోనే ఎప్పుడు లేనంత మాస్క్ లుక్ లో రామ్ పోతినేని కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో రామ్ మరొ కొన్ని కొత్త లుక్స్ పరిచయం చేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది . దీంతో రామ్ అభిమానులు సైతం ఆయన నటించిన సినిమా టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు . దీంతో రామ్ పోతినేని పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చూడాలి మరి బర్తడే కి రామ్ పోతినేని ఏ విధంగా అభిమానుల్ని సాటిస్ఫై చేస్తాడో..?

 

 

Share post:

Latest