కమలహాసన్ ఈసారి రాజకీయాలలో సక్సెస్ అవుతారా..?

అపజయాలతో సతమతమవుతున్న సమయంలో నటుడు కమలహాసన్ కు విక్రమ్-2 చిత్రం మంచి ఘనవిజయాన్ని అందించింది. దీంతో ఒక్కసారిగా కమలహాసన్ మరింత పాపులారిటీ సంపాదించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించడంతో తమిళనాడులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై కమలహాసన్ నటునకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. దీంతో విక్రమ్ 3 చిత్రం కూడా సిద్ధమవుతోంది కానీ ఇదే కాకుండా ధనుష్ తో ఒక చిత్రాన్ని కూడా కమలహాసన్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

Kamal Haasan Plans To Quit 'Bigg Boss' Tamil To Concentrate On Acting Career
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా అయిపోగానే రజినీకాంత్ మణిరత్నం రూపొందిస్తున్న దళపతి సినిమా సీక్వెల్ ని కూడా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఇలా సినిమాల పరంగా వెరీ బిజీగా ఉన్నారు కమలహాసన్. వాస్తవానికి 2018 లో వచ్చిన విశ్వరూపం-2 సినిమా చాలా డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఈ విషయం మరువకముందే 2021 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయక ఆయన పార్టీని పూర్తిగా తిరస్కరించడం జరిగింది.

దీంతో విక్రమ్ -2 సినిమా విజయం సాధించడంతో ఆయన అభిమానులలో మరొక కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికలలో కమలహాసన్ పార్టీ కె మద్దతుగా నిలచాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బాహుబలి సినిమా కలెక్షన్లను విక్రమ్ సినిమా అధికమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సారు రాజకీయాలలో కమలహాసన్ సక్సెస్ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం బాక్స్ ఆఫీస్ విజయాలను పొలిటికల్ సక్సెస్ కు దారి తీసే పరిణామాలు అసలు లేవని కూడా తెలియజేస్తున్నారు సినీ రంగం వేరు రాజకీయ రంగం వేరు అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో సినీ రంగానికి చెందిన జయలలిత, కరుణానిధి, MGR వంటి వారు రాజకీయాలలో సక్సెస్ అవ్వగా ఇప్పుడు మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలుపుతున్నారు.

Share post:

Latest