శర్వానంద్ వివాహ ఖర్చు రోజుకి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ హీరో శర్వానంద్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సినీ సెలబ్రెటీల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుక హైదరాబాదులో జరిగింది ఇటీవల వీరికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీల ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం.

Sharwanand and Rakshitha Reddy's wedding called off? Here's the truth -  India Today

జూన్ 2,3వ తేదీలలో గ్రాండ్గా వీరి వివాహ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. శర్వానంద్ రక్షితా రెడ్డిల వివాహం జూన్ -3వ తేదీన జరుగుతోంది. ఈ వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు దాదాపుగా రూ .4కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు బంధువులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

అంతకుముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉండడం వల్ల శర్వానంద్ వివాహం కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా శర్వానంద్ కు కాబోయే భార్య రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే హైదరాబాద్ హైకోర్టుకు చెందిన మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈమె. మరి పెళ్లి వివాహాన్ని శర్వానంద్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest