టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న మలయాళ ముద్దుగుమ్మలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ముంబై మోడల్స్ సైతం భారీగా తగ్గిపోయిందని చెప్పవచ్చు.. మోడ్రన్ బ్యూటీలకన్నా న్యాచురల్ బ్యూటీలకె తెలుగు ఆడియన్స్ సైతం ఎక్కువగా ఫిదా అవుతున్నారు.. గడిచిన ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల విషయానికి వస్తే.. మాలీవుడ్ నుంచి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు.సౌత్ లో నుంచి అత్యధిక హీరోయిన్లు ఇక్కడినుంచి ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళ సక్సెస్ రేటు కూడా భారీగానే ఉంటోంది.

హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉన్నారంటే అందుకు కారణం న్యాచురల్ బ్యూటీతో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అందంలో అచ్చ తెలుగు అమ్మాయిలను తలపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. అలా కీర్తి సురేష్, సంయుక్త మీనన్, మాళవిక మోహన్, మాళవిక నాయర్ ,నివేద థామస్ తదితర భామలు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యారు. అందుకు కారణం ఈ అమ్మడు యొక్క లక్షణాలే అని చెప్పవచ్చు. ఈ భామలతో పాటు ముంబై నుంచి చాలామంది మోడల్స్ దిగుమతి అయ్యారు కానీ వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.

Malavika Mohanan takes hotness to a new level in traditional dress - News -  IndiaGlitz.com
టాలీవుడ్ దర్శక నిర్మాతలు హీరోయిన్లు ఎంపిక విషయంలో మొదటి ఛాయస్ గా కేరళ ముద్దుగుమ్మలనే ఎంచుకోవడం జరుగుతోంది .ఆ తర్వాత బెంగళూరు చెన్నై భామలను దిగుమతి చేసుకుంటున్నారు చివరికి తమ పాత్రకి బోల్డ్ నెస్ అవసరం అనుకుంటేనే కేవలం ముంబై భామలను తీసుకోవడం జరుగుతోంది. అయితే ముంబై మోడల్స్ ఎక్కువగా బోల్డ్ పాత్రలలో నటిస్తూ ఉంటారు ఇలాంటి వాటిని సౌత్ భామలు పెద్దగా ఎంకరేజ్ చేయరు. ప్రస్తుతం మెజారిటీ ఛాయస్ ఎక్కువగా మాలీవుడ్ భామలదే అని చెప్పవచ్చు.

Share post:

Latest