పెళ్లి త‌ర్వాత‌ ప‌ట్టించుకోని యంగ్ హీరోలు.. కాజ‌ల్ సంచ‌ల‌న నిర్ణ‌యం!?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. గ‌త‌ ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ప్రసాదం వరుస సినిమాలతో బిజీ అయింది.

కానీ ఈ అమ్మడుకు సీనియర్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌.. ఇలా ఈతరం యంగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత వారు ఎవరు కాజల్ ను పట్టించుకోవడం లేదు. దీంతో కాజల్ సంచలన నిర్ణయం తీసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటాలని భావిస్తుందట.

ఈ క్రమంలోనే తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. `మేజర్‌` డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క కథ అందిస్తున్న ఓ సినిమాలో కాజల్ న‌టించ‌బోతోంది. అఖిల్‌ అనే నూతన దర్శకుడు ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా ఛాలెంజింగ్ రోల్ లో కాజ‌ల్ క‌నిపించ‌బోతోంది. జూన్ నుంచి ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

Share post:

Latest