“అదే జరిగితే కత్రినాకు డివర్స్”.. విక్కి కౌశల్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట రీసెంట్గానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . పెళ్లికి ముందు డేటింగ్ చేశారు అంటూ కామెంట్స్ వినిపించినా.. వాటికి ఆధారాలు లేవు .. కానీ ఈ జంట మాత్రం తమ పెళ్లిళ్లు చాలా పద్ధతిగా గ్రాండ్గా రాయల్ లుక్ లో చేసుకున్నారు .

వీళ్ళ పెళ్ళి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు . ఏకంగా స్టార్ సెలబ్రెటీస్ ఫోన్స్ సైతం లాక్కునేసి.. మరి లోపలికి ఇన్వైట్ చేసింది . రీసెంట్ గా విక్కి కౌశల్ చేస్తున్న సినిమా “జరా హట్కే జరా బచ్కే”.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతున్న విక్కి కౌశల్ కు పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి .

ఇదే క్రమంలో విక్కీ కౌశల్ ని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ .. తన వైవాహిక జీవితానికి సంబంధించిన గురించి ప్రశ్నించారు . “ఈ క్రమంలోని కత్రినా కైఫ్ కంటే మంచి నటి మీకు దొరికితే ఆమెను వదిలేస్తారా..? అంటూ ప్రశ్నించారు”. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ హస్బెండ్ ఘాటుగా మీడియాకు జవాబు ఇచ్చారు . “మీరు అడుగుతున్న ప్రశ్న నాకు అర్థం కావడం లేదు. నేను కత్రినాను పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఉంచడానికే.. కలిసి ఉండాలని మేము పెళ్లి చేసుకున్నాం. మీరు ఇలా విడాకుల గురించి మాట్లాడుతున్నారు ..నాకేం అర్థం కావడం లేదు “అంటూ రిపోర్టర్ కి షాక్ ఇచ్చాడు . ఈ క్రమంలోనే విక్కి కౌశల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Share post:

Latest