అమిత్ షా పరువు తీసేసిన నిఖిల్.. అందరి ముందే అసలు గుట్టు బయటపెట్టేసాడురోయ్..!!

“హ్యాపీ డేస్” సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన నిఖిల్ సిద్ధార్థ్ .. ఇప్పుడు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నిఖిల్ .. రీసెంట్గా చేస్తున్న సినిమా “స్పై”. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతుంది. ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది . ఎడిటర్ గారి దర్శకుడుగా వస్తున్న ఈ సినిమా భారీ తారగాణంతో తెరకెక్కింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే వదిలారు .

ఈ క్రమంలోనే నిఖిల్ పై సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఈ సినిమా జూన్ 29న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా మొత్తం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే విధంగానే తరకెక్కించినట్లు సమాచారం అందుతుంది . స్పై టీజర్ ను మే 15న గ్రాండ్గా దేశ రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేశారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

కాగా హైదరాబాద్లో రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న నిఖిల్ కి టఫ్ క్వశ్చన్ ఎదురైంది . ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధి మాట్లాడుతూ..” మొన్న కార్తికేయ 2.. ఇప్పుడు స్పై ..మీరు ఒక పార్టీకి అనుకూలంగా సినిమాలు తీస్తున్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి..? మిమ్మల్ని అమిత్ షా కూడా కలవడానికి పిలిచారు ..? దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోని నిఖిల్ సమాధానం ఇస్తూ ..”సుభాష్ చంద్రబోస్ గారి సినిమా ఇది. కార్తికేయ కృష్ణుడికి సంబంధించింది . నాకు మొదటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఇష్టం.

అందుకే ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను . చిన్నప్పటి నుంచి నేను ఏ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్న చంద్రబాబు గెటప్ వేసే వాడిని .. అందుకే ఈ సినిమా చూస్ చేసుకున్నాను. నేను ఏ పార్టీకి ఏ కమ్యూనిటీకి సంబంధించిన సినిమాలు తీయట్లేదు . అమిత్ షా గారి నుంచి ఇన్విటేషన్ వచ్చిన మాట వాస్తవమే.. కానీ నేనే కావాలని వెళ్ళలేదు . ఆయన కలిస్తే మళ్ళీ ఏదో ఒక రాజకీయం చేసేస్తారు.. అది రాజకీయంగానే చూస్తారు .. అందుకే నేను కలవలేదు .. నా సినిమాలు ఏ రాజకీయ నేతకి సపోర్ట్ చేయవు.. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అమిత్ షా లాంటి పెద్దాయన పిలిచినా కూడా వెళ్లలేదా ..? అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు నిఖిల్ కి హిట్ పొగరు తలకి ఎక్కిందని అందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు .. మరికొందరు నిఖిల్ చెప్పింది అక్షరాల నిజమని .. ఓ హీరోకి ఆ మాత్రం హెడ్ వెయిట్ ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నారు .చూడాలి మరి దీనిపై బీజేపీ నాయకులు ఎవరైనా ఏమైనా స్పందిస్తారో లేదో..?