ఉప్పెన సినిమాతో మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా హీరో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాతో అందుకున్న విజయాన్ని తర్వాత సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు. అదే తరుణంలో వైష్ణవ్ తేజ్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాతో ఈ మెగా హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాస్టర్లు ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్‌ను ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
PVT04 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘ఆదికేశవ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ లో వైష్ణవ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశాడు. మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.
ఆ మైనింగ్ చేస్తూ శివుడి గుడిని కూడా విలన్స్ కూల్చడానికి ట్రై ప్రయత్నిస్తుంటే హీరో వాళ్ళని అడ్డుకోవడమే సినిమా కథ అని తెలుస్తుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు జంటగా యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో అయాన ఈ మెగా హీరో హిట్ అందుకుండో లేదో చూడాలి.