బాలయ్య కారణంగా దెబ్బలు తిన్న యంగ్‌హీరో… విషయం తెలిస్తే నవ్వు ఆగదు మరి..!

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒక‌రు. 2010లో విడుదలైన `కర్మ` అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. శేష్‌. కెరీర్ ఆరంభంలో స‌హాయ‌క పాత్ర‌ల‌ను, విల‌న్ పాత్ర‌ల‌ను పోషించాడు. 2016లో వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ `క్షణం`తో హీరోగా నిల‌దొక్కుకున్నాడు. క్షణం, అమీతుమీ, గూఢచారి, ఎవ‌రు, మేజర్, హిట్ 2.. ఇలా బ్యాక్ టు బ్యాక్ విజ‌య‌ల‌ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు.

Adivi Sesh thanks Nag, Bunny and Samantha | 123telugu.com

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా అడివి శేష్‌.. కోన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కార‌ణంగా త‌న్నులు తిన్నాను అంటూ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రివీల్ చేశాడు. అయితే బాలకృష్ణ కారణంగా చిన్నతనంలో మా అమ్మ నన్ను చాలా తిట్టేవారు .నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడిని.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఒక పాట విన్నాను.. ఆ పాట నాకు చాలా నచ్చింది.

Balakrishna songs hurts Adivi Sesh

ఆ పాట న‌చ్చి హమ్ చేయడం ప్రారంభించాను.. అలానే పాడుతూ.. ఇంటికి వెళ్లాడ‌ట‌. అయితే అడివి శేష్ పాటు విని వాళ్ల అమ్మ చిత‌క్కొట్టింద‌ట‌. ఇక ఆ పాట నాకు ఎప్పటికీ గుర్తుంది.. బాలకృష్ణ సినిమాలోని బీడీలు తాగండి బాబులు అనే పాట పాడినందుకు మా అమ్మ నన్ను తెగ కొట్టింది.. అంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు అడవి శేష్.

Adivi Sesh announces launch date of pan-India movie 'G2' - Telugu News -  IndiaGlitz.com

ఇక కొద్ది రోజుల త‌ర్వాత అడివి శేష్ మరో పాట పాడాడట. `ముద్దు పాపా హే ముద్దు పాపా..` పాడుతుండగా వాళ్ల అమ్మ వినేశార‌ట‌. అది విని మరోసారి కొట్టింది. అప్పటినుంచి సినిమా పాటలు పాడడం పూర్తిగా మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. దీంతో అడవి శేష్‌ను చిన్నప్పుడు తల్లి కొట్టడానికి బాల‌య్య‌ కారణమంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మ‌రింది.

Share post:

Latest