సినిమాల్లోనే కాకుండా రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా అదరగొడుతున్న టాలీవుడ్ హీరోలు ఎవరంటే..!

ఒకే ఆదాయంపై ఆధారపడటం మంచిది కాదు అంటారు పెద్దలు.. అందుకేనే మన టాలీవుడ్డ్ స్టార్‌లు కూడా ఇదే దారిలో పయనం అవుతున్నారు. ఒకవైపు సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇప్పటి తరం యంగ్ హీరోల వరకు చాలామంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు.

అందులో కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోలు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకు ఆ హీరోలు ఎవరు వాళ్లు నడిపించే రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Naga Chaitanya Opens A New Restaurant - Shoyu Hyderabad Advertisement |  Chay Akkineni | #Swiggy - YouTube

నాగచైతన్య:
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో నాగచైతన్య వరుస సినిమాలు చూసుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. నాగచైతన్య కూడా సొంతంగా రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రోడ్ కావేరి హిల్స్ లో షోయు క్లౌడ్ కిచెన్ అనే రెస్టారెంట్. అయితే ఇందులో కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్లడం మాత్రమే ఉంటుంది.ఇక్కడ డైనింగ్ ఉండదు.

What's cooking in Tollywood? Six actors who own restaurants | The News  Minute

అల్లు అర్జున్:
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఇక అల్లు అర్జున్ సినిమాలోనే కాకుండా సైడ్ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఈయనకు కూడా ఒక రెస్టారెంట్ ఉంది జూబ్లీహిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ అనే పేరుతో నడుస్తుంది.

Popular eateries owned by Telugu celebrities - In Pics | Deccan Herald

సందీప్ కిషన్:
మరో టాలీవుడ్ యంగ్‌ హీరో సందీప్ కిషన్ కూడా వరుస క్రేజీ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ యువ హీరో కూడా సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లో దూసుకుపోతున్నాడు అందులో ప్రధానంగా రెస్టారెంట్ బిజినెస్ లో అదరగొడుతున్నాడు. వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ పేరుతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉంది. ఇక ఈ రెస్టారెంట్ నుంచి సందీప్ కిషన్ బాగా సంపాదిస్తున్నాడని కూడా తెలుస్తుంది.

AN Restaurants - The Siasat Daily

మహేష్ బాబు- నమ్రత:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు కూడా ఏఎన్ రెస్టారెంట్ ను నడిపిస్తున్నారు. ఇది హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఎంతో విలాసవంతమైన రెస్టారెంట్స్ లో ఒకటి. ఈ రెస్టారెంట్ కూడా వారికి బాగానే సంపాదన ఇస్తుంది.

Telugu Allu Arjun, Mahesh Babu, Namrata, Pushpa, Rana-Movie

దగ్గుబాటి రానా:
దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో రానా కూడా సినిమాల్లోనే కాకుండా ఎన్నో బిజినెస్ లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అది వచ్చేసి శాంక్చ్యువరీ బార్ అండ్ కిచెన్. ఇక ఇది బంజారాహిల్స్ లో ఉంది. ఇక ఈ రెస్టారెంట్ ను రానా చిన్న ఇంటినే అలా మార్చాడని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Mahesh Babu, Namrata, Pushpa, Rana-Movie

ఆనంద్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్ దేవరకొండ కూడా రెస్టారెంట్ బిజినెస్ ను నడిపిస్తున్నాడు.అది వచ్చేసి కాజిగూడలో గుడ్ వైఫ్ ఓన్లీ కేఫ్ అనే రెస్టారెంట్ ని నడిపిస్తున్నాడు. ఇలా ఈ హీరోలే కాకుండా మిగిలిన హీరోలు కూడా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా వ్యాపార రంగంలో అడుగుపెట్టి బాగా సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ విధంగా హీరో హీరోయిన్లు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టి వ్యాపార రంగంలో అంతకుమించి సంపాదిస్తున్నారు.

Share post:

Latest