“నాకు అదే ఇష్టం..అందుకే అలానే చేస్తా”.. మరోసారి టంగ్ స్లిప్ అయిన పూజా పాప.. !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఏ విషయాన్ని అయినా సరే ఎలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జనాలు ఎటువంటి ప్రశ్నలు అడిగినా సరే వాటికి నో , కాదు అనకుండా ఓపెన్ గా ఆన్సర్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ గా మారింది .

రీసెంట్ గా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నింది. ఈ క్రమంలోనే ఆమెకు ఫ్యాషన్ అన్న కాన్సెప్ట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి . “మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏంటి ..?” అంటూ ఓపెన్ గా అడిగేసారు . ఈ క్రమంలోనే ఆమె ఆన్సర్ ఇస్తూ..”ఫ్యాషన్ అంటే మనకి కన్వీనెంట్గా సౌకర్యంగా ఉన్న బట్టలు వేసుకోవడమే.. ఎంత ఖరీదు పెట్టామా..? ఎంత స్టైలిష్ గా ఉన్నది కాదు..? ఏ బట్టలు వేసుకున్న మనకి సౌకర్యవంతంగా ఉందా లేదా.. అదే ఇంపార్టెంట్ ..అలాంటి బట్టలను వేసుకుంటే ఎవరికైనా హ్యాపీ” అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు పూజ హెగ్డే పొట్టి బట్టలు వేసుకుంటుంది కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . అదే విషయంపై స్పందిస్తూ..” నా ఇష్టం నాకు ఎలాంటి బట్టలు కంఫర్టబుల్ గా ఉంటే అలాంటివి వేసుకుంటాను. నాకు నచ్చితే ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను.. బికినీ వేసుకోవడానికి కూడా ఆలోచించను” అంటూ హాట్ కా ఆన్సర్ చేసిందట. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజ హెగ్డే కి అవకాశాలు రాక అల్లాడుతుంటే.. ఇలా ఓపెన్ గా బోల్డ్ కామెంట్స్ చేయడం పూజ పాపకు మరింత మైనస్ గా మారింది..!!

Share post:

Latest