సూసైడ్ చేసుకోవాలి అనుకున్న శరత్ బాబు కి.. కొత్త లైఫ్ ఇచ్చింది ఆయనే..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పలు వార్తలను ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే శరత్ బాబు గతంలో సూసైడ్ చేసుకోబోయాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే శరత్ బాబు ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించేస్తాడు. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయాలను అస్సలు ఆలోచించడు . కధా.. కంటెంట్ బాగుండాలి ..అప్పుడే ఆయన అపాత్రను యాక్సెప్ట్ చేస్తారు . అలాంటి ఓ మంచి నటుడు శరత్ బాబు .

శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు . కాన్పూర్ నుంచి శ్రీకాకుళం ఆముదలవలస వలస వచ్చారట ఆయన కుటుంబం. అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ హోటల్ ని తీసుకొని నడిపించేవారట. అప్పుడు వారికి చాలా పెద్ద కుటుంబం . సుమారు కుటుంబంలో 14 మందికి పైగానే ఉండేవారట . చిన్న హోటల్లోనే ఉండాల్సి వచ్చేదట . చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట శరత్ బాబు . పైగా ఒకే హోటల్ పై ఇంత మంది ఆధారపడడంతో డబ్బులు అస్సలు సరిపోయేవి కాదట. నానా కష్టాలు పడ్డారట. చదువుకోవడానికి కూడా వీళ్ళు లేని పరిస్థితిలో శరత్ బాబు నలిగిపోయారట . పరిస్ధితులు చేజారిపోతుండడంతో బాధలు భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట శరత్ బాబు. ఆ టైంలోనే శరత్ బాబుకు దేవుడులా కనిపించాడు ఆయన ఫ్రెండ్ రంగ సత్యనారాయణ .

ఆయన చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబు చెప్పుకొచ్చారు . ఆయన ఫ్రెండ్ రంగ సత్యనారాయణ సపోర్ట్ తోనే ఆయన ఈ రేంజ్ కి ఎదిగాడట . మొదట రైల్వే క్యాంటీన్ నడిపించారట.. ఆ తర్వాత హోటల్ అద్దెకి తీసుకొని నడిపించారట. కొన్నాళ్లకు దాన్ని కొనుక్కునేసారట. అలా రాత్రిపూట శరత్ బాబు స్నేహితుడు ఇంటి మెట్ల మీద కూర్చొని చదువుకునే వారట. ఇల్లు కూడా లేక బాధపడుతుండటంతో ఆ సమయంలో ఇల్లు కావాలని అడగడంతో తన ఇంటిని వాళ్లకు అమ్మేశానని ఆయన ఫ్రెండ్ రంగ సత్యనారాయణ గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు .

Share post:

Latest