సీనియర్ నటుడు శరత్ బాబు అసలు పేరు ఏంటో తెలుసా..? రాత్రికి రాత్రి ఎవ్వరికి తెలియకుండా పేరు ఎందుకు మార్చుకున్నాడంటే..?

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు . గత కొంతకాలంగా అనారోగ్య కారణంతో బాధపడుతున్న ఆయన.. మొదట బెంగళూరులో చికిత్స తీసుకుంటూ వచ్చారు.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్లే ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన సినీ ప్రస్థానం గురించి పలు వార్తలను వైరల్ చేస్తున్నారు అభిమానులు. శరత్ బాబు మాతృభాష తెలుగులోనే కాదు తమిళ – మలయాళ – కన్నడ చిత్రాలలో ఎన్నో సినిమాల్లో నటించాడు . తెలుగులో కన్నా తమిళనాడులో శరత్ బాబు ఆదరణ పొందారు అంటే దానికి మెయిన్ రీజన్ ఆయన చూస్ చేసుకునే స్టోరీలే అని చెప్పాలి .

అంతేకాదు సుమారు ఆయన 250 కి పైగా చిత్రాలల్లో నటించారు. కాగా ఇప్పటివరకు చాలామందికి శరత్ బాబు ఒరిజినల్ నేమ్ ఏంటో తెలియదు . ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ . అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన పేరుని శరత్ బాబుగా మార్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఆకర్షణీయంగా పేరు ఉంటేనే జనాల కంటికి కనపడతామని రాత్రికి రాత్రి సత్యనారాయణ దీక్షిత్ గా ఉన్న ఆయన పేరును శరత్ బాబుగా మార్చుకున్నారట . అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది.

కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకు చెందిన విజయ శంకర దీక్షితులు – దేవి ల సంతానమే శరత్ బాబు . నిజానికి ఓ పెద్ద పోలీస్ ఆఫిసర్ అవ్వాలని అనుకున్నాడట శరత్ బాబు . అయితే విధి ఆడిన వింత నాటకంలో ఇలా ఇండస్ట్రీలో హీరోగా వచ్చి ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను అందించాడు . కేవలం హీరో గానే కాదు విలన్ గా ..సపోర్టింగ్ యాక్టర్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. అంత మంచి నటుడు మన మధ్య లేకపోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టమని చెప్పాలి..!!