వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద‌ది అయిన ర‌మాప్ర‌భ‌ను శ‌ర‌త్ బాబు అందుకే పెళ్లి చేసుకున్నాడా?

సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు నెల‌ల నుంచి తీవ్ర‌మైన‌ అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. మ‌ల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వ‌డంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో రెండు వంద‌ల‌కు పైగా సినిమాలు చేసిన శ‌ర‌త్ బాబు.. హీరోగానే కాకుండా విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు.

అయితే న‌టుడిగా సూప‌ర్ స‌క్సెస్ అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిన్ అయ్యారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. అప్పటికే రమాప్రభ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వ‌య‌సులో ఐదేళ్లు పెద్ద‌ది అయిన ర‌మాప్ర‌భ‌తో శ‌ర‌త్ బాబు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. కానీ, కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.

ఇప్పటికి రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. అయితే వీరి ప్రేమ‌, పెళ్లిపై గ‌తంలో సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `ర‌మాప్రభ పెద్ద హీరోయిన్. శరత్ బాబు అప్ కమింగ్ హీరో. ర‌మాప్ర‌భ‌నే శ‌ర‌త్ బాబును మొద‌ట ప్రేమించింది. ఆ త‌ర్వాత త‌న అవ‌స‌రాల కోసం శ‌ర‌త్ బాబు కూడా ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. రమాప్రభ స‌పోర్ట్ తో సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకున్నాడు. శరత్ బాబును హీరోగా ప్రమోట్ చేసేందుకు రమాప్రభ నిర్మాతగా కూడా మారింది. రమాప్రభ అండతో శరత్ బాబు హీరోగా నిల‌దొక్కుకున్నాడు. న‌టుడిగా ఫుల్ బిజీ అయిన స‌మ‌యంలోనే ర‌మాప్ర‌భ‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు తలెత్తాయి. దాంతో విడిపోయారు` అంటూ జర్నలిస్టు వెంకటేశ్వరరావు తెలిపారు. త‌న అవ‌స‌రాల కోసం, సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం కోస‌మే శ‌ర‌త్ బాబు ర‌మాప్ర‌భ‌ను వివాహం చేసుకున్నాడ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

Share post:

Latest