శరత్ బాబు ఇద్దరు భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన నటీనటులను కోల్పోయి పూర్తిస్థాయిలో దుఃఖితులవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కూడా కన్నుమూసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఏ ఐ జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోని ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Sarath babu , Ramaprabha Wedding Controversy! SARATH BABU TRYING TO BREAK  THE TRUTH!- Dinamani

సీనియర్ నటుడు శరత్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే శరత్ బాబుకు రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ కూడా ఆయన విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తున్నారు. మొదటి భార్య రమాప్రభ.. ఈమె గురించి అందరికీ తెలిసిన విషయమే.. 1974లో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమప్రభ ను పెళ్లి చేసుకున్న శరత్ బాబు 1988లో ఆమెతో విడిపోయారు. వాస్తవానికి ప్రేమించి రెండు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జరిగింది. కొన్నాళ్లు సాఫీగా సంసారంలో..ఆ తర్వాత ఆస్తి నంతా శరత్ బాబు కరగదీసాడు అన్న కారణంతో ఆమె అతడి నుంచి దూరం అయింది. ఇక తర్వాత నుంచి అడపాదడపా సినిమాలలో నటిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒంటరిగా జీవిస్తున్నారు రమాప్రభ.

విడాకులైన రెండేళ్ల తర్వాత అంటే 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను పెల్లాడి 2011లో ఆమెకు కూడా డివోర్స్ ఇచ్చారు. అలా ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నా ఆయన ఇద్దరితో కూడా ఉండలేకపోయారు ప్రస్తుతం తన సోదరి ఇతర బంధువులతో కలిసి ఉంటున్న ఆయన తాజాగా ఆర్గాన్స్ చెడిపోవడంతో మరణించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడు మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇక 300కు పైగా చిత్రాలలో నటించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు.

Share post:

Latest