శరత్ బాబు హీరో కావడం వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ రోజున ఆయన కొన్ని గంటల ముందు మరణించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా శరత్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Sarath Babu Death | Sarath Babu Passes Away | Veteran South-Indian Actor Sarath  Babu (71) Dies! - Filmibeat
శరత్ బాబు విజయ శంకర దీక్షితులు, సుశీల దేవి కుమారుడు.. వీరి కుటుంబంలో మొత్తం 13 మంది సంతానమట ఇంట్లో అందరూ తనని సత్యంబాబు అని పిలిచేవారట.. కాలేజీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారట. మొదటిసారి దొంగాటకం అనే నాటక కోసం స్టేజ్ ఎక్కారట. దీంతో తను పోషించిన నాటకం ఫోటోలు మ్యాగజైన్లో కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వాటిని చూసిన స్నేహితులు నువ్వు హీరోగా అవుతావు అంటూ చెప్పేవారట.

Sarath Babu, Sarath Babu's family has 14 members.
వీరికి ఊర్లో ఒక గౌరీ శంకర్ అని హోటల్ కూడా ఉన్నదట. చుట్టుపక్కల ప్రాంతాలలో హోటల్ చాలా ఫేమస్ అన్నట్లుగా తెలిపారు. తన అన్నయ్యతో కలిసి ఈ ఓటల్ని చూసుకునే వారట. కాలేజీ పూర్తి అయిన వెంటనే హోటల్లో చిన్న చిన్న పనులు చేస్తూ అన్నయ్యకి సహాయం చేసే వారట.అలాంటి సమయంలో తన స్నేహితులు మద్రాసు కు వెళ్ళమంటూ చాలా బలవంతం చేయడంతో చేసేదేమీ లేక డైరెక్టర్ ఆదుర్తి సుబ్బరావు గారి దగ్గర ఫోటోలను పంపించారట శరత్ బాబు.. దీంతో ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం పంపించగా మద్రాసు కు వెళ్లిన ఆయన తనను పైనుంచి కింది వరకు చూసి మళ్లీ పిలుస్తాను అని చెప్పారట. అయితే అక్కడ అడిషన్కు 3000 మంది రాక చివరికి తనను సెలెక్ట్ చేశారట. ఆశ్చర్య దీంతో ఆశ్చర్యపోయానని అలా మొదటిసారి రామరాజ్యం సినిమా కోసం పని చేశానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు శరత్ బాబు. స్నేహితుల సహకారం వల్లే ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.