ప్రాజెక్ట్ కే మూవీ కోసం దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

టాలీవుడ్ హీరో ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా నటింప చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Project-K Team Wishes Deepika Padukone On Her Thirty- Seven Birthday

ఇక ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో దీపికా స్థాయి ఓ రేంజ్ కి పెరిగిపోయింది. దాంతో ప్రాజెక్ట్ కే యొక్క స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ లో పెరగటం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీపిక పదుకునే యొక్క సన్నివేశాలను ఇంకాస్త ఎక్కువగా పెంచే యోచనలో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Deepika Padukone and Prabhas Join Hands In First Scene of Project K Watch

ఇప్పుడు అందుతున్న వార్త ప్రకారం గతంలో ఈ సినిమా కోసం దీపికాను హీరోయిన్ గా అనుకున్న సమయంలో దాదాపుగా 7 నుండీ 8 కోట్ల రూపాయలను ఆఫర్ చేయడం జరిగిందట కానీ ఇప్పుడు పెరిగిన స్క్రీన్ మరియు కాల్షీట్స్ కారణంగా ఏకంగా రూ.10 కోట్ల రూపాయల పారతోషికమును ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ కు రూ.100 కోట్ల పారతోషికం ఇవ్వటంతో పాటు దీపికాకు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే.. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో దీపిక పదుకునే అందాల ఆరబోతలు ఈ సినిమాలో చూడలేం కానీ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో ఆమెని చూడబోతున్నాం అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దిశా పటానీ కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు.ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Share post:

Latest