నయనతారపై షారుక్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..

అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా రీసెంట్‌గా నయనతార చాలా అందంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు. పఠాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్ ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. నటుడు విజయ్ సేతుపతి లాంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

జవాన్ సినిమాకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జవాన్ సినిమా విడుదల తేదీని సోమవారం రోజు అధికారికంగా ప్రకటించారు షారుఖ్ ఖాన్. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆన్లైన్ ద్వారా తెలిపారు.

అ తరువాత ఆన్‌లైన్‌లో అభిమానుల అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు షారుఖ్. జవాన్ అనేది ఒక పక్క కమెర్షియల్ అంచనాలతో కూడిన యాక్షన్ కథ అని ఆయన తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ నయనతారతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది అని షారుఖ్ అన్నారు. అంతేకాకుండా నయనతార చాలా అందగత్తే అని, స్వీటీ అని పేర్కొన్నారు. అలానే యాక్టర్ విజయశాంతి నుంచి కూడా తాను చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.

Share post:

Latest