కొత్తగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సమంత.. దాని విశేషాలు ఇవే..

సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమై ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఇటీవలే అనారోగ్య బారిన పడిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలలో బిజీ అయిపోయింది. తాజాగా సామ్ ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని నానక్రామ్గూడాలో జయబేరి ఆరంజ్ కౌంటీలోని నల్లా ప్రీతమ్ రెడ్డి వద్ద నుంచి సమంత ఈ భవంతిని కొనుగోలు చేసిందట.

ఓపెన్ ప్లేస్ పోగా 7,944 ఎస్ఎఫ్టై విస్తీర్ణంలో ఆ అందమైన ఇంద్ర భవనం నిర్మించారు. అందులో ఆరు కారు పార్కింగ్స్ స్లాట్స్ కూడా ఉన్నాయట. ఇదిలా ఉండగా నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా చై ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా ఒక యాంకర్ చైతన్యాన్ని మీ కో- యాక్టర్స్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అని ప్రశ్నించగా… నాగచైతన్య సమాధానం చెప్తూ ‘ పూజ హెగ్డే లో స్టైల్, సమంతలో హార్డ్ వర్కింగ్, కృతి శెట్టి లో ఇన్నోసెన్స్ నచ్చుతుంది’ అని చెప్పారు.

అంతేకాకుండా సమంతానే తాను ఫస్ట్ కిస్ చేశా అని చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సమంత, నాగచైతన్య లకి ఫస్ట్ మూవీ అయిన ఏ మయా చేసావే సినిమాలోనే చైతు ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ కిస్ సీన్‌లో నటించానని, సమంతను కిస్ చేసే సమయంలో తన చాలా బాగా సపోర్ట్ చేసిందని నాగచైతన్య చెప్పాడు. విడిపోయిన ఈ జంట మళ్ళీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య మనసులో కూడా అదే ఉండి ఉండొచ్చు. అందుకే ప్రతిచోటా సమంత గురించి ప్రస్థావిస్తున్నాడు. ఇంకోవైపు సామ్ డూప్లెక్స్ భవనం కొనుగోలు చేసి హ్యాపీగా లైఫ్‌లో ముందుకి వెళ్తుంది.

Share post:

Latest