నటుడు పృధ్విరాజ్ కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందిన నటుడు పృథ్వీరాజ్ తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ నటుడు తాజాగా అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నా ఈయన సడన్ గా ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు కాస్త కంగారుపడుతున్నారు. ఆస్పత్రి బెడ్ రూమ్ పైన సెలైన్ బాటిల్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కమెడీయన్ పృధ్విరాజ్.. పొలిటికల్ ఎంట్రీ కుటుంబానికి ఇష్టం లేదా..? - Telugu  Journalist
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఆసుపత్రి బెడ్ పైనుంచి ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది నటుడు పృథ్వి. డైరెక్టుగా మొదటిసారి తన సినిమా తీయబోతున్నానని కొత్త రంగుల ప్రపంచం ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి ఈ నెల 26న ఈవెంట్ చేయబోతున్నామంటూ తెలియజేశారు.. సెలైన్ తో ఉన్నప్పటికీ సినిమా గురించి ఆలోచిస్తున్నాను మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ టీం కి మీ అందరికీ సపోర్టుగా ఉండాలి.. అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు నటుడు పృద్వి.

కానీ తన ఆరోగ్యం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. అయితే తీవ్ర అలసట వల్లే పృథ్విరాజ్ ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు చిత్రాలలో విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన పృధ్విరాజ్ వేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. రాజకీయాలలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైసిపి పార్టీలో చేరి SVBC చైర్మన్గా విధులు నిర్వహించిన కొన్ని కారణాల చేత ఆ పార్టీని వీడి ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.

Share post:

Latest