టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోందీ. అంతేకాదు.. అప్పుడప్పుడు యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎంపిక చేసుకుంది. ఇందులో బాగంగా సమంత నటించిన పెప్సీ కమర్షియల్ యాడ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
నిమిషం లోపే ఉన్న ఆ వీడియోలో సమంత విభిన్నమైన గెటప్స్‌లో కనిపించింది. స్టంట్స్ చేస్తూ.. పెళ్లి కూతురుగా పలు రకాలుగా సమంత కనిపించింది. సమంత పెప్సీ యాడ్ వైరల్ గా మారింది. ఈ వీడియో లో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించిన సమంత.. స్టంట్స్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది. దీంతో.. ఈ పెప్సీ వీడియో నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌గా మారింది. ఇక సమంత చేసిన ఈ వైరల్ వీడియో పై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
“ఈ యాడ్ వీడియో చూస్తే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అమ్మాయివి నీకు టెన్నిస్ క్రీడ అవసరమా, ఆడి ఏం సాధిస్తుందో అంటూ చాలా మంది అన్నారు. టెన్నిస్ మహిళల క్రీడ కాదు. నువ్వు ఎంత దూరం వెళ్లగలవు అన్నారు. కానీ నేను నా కలను సాధించేందుకు కష్టపడ్డాను. నా కలను ఎప్పుడూ వదులుకోలేదు. ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నాను. సమాజం నా గురించి ఏమి మాట్లాడుతుందో నేను పట్టించుకోలేదు. సంకల్పంతో విజయాన్ని సాధించడానికి శక్తితో పైకి లేచాను.
సమంత పెప్సీ యాడ్ నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం… తమ కలలను సాధించుకోవడానికి ముందుకు సాగడానికి సరైన ప్రేరణగా నిలుస్తుందని సానియా మీర్జా ఆ పోస్ట్‌లో పేర్కొంది. సమంత యాడ్ పట్ల సానియా స్పందించడంతో ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.
View this post on Instagram