త‌న కొడుకును పరిచయం చేసిన త్రిష.. పెళ్లి కాకుండానే పెద్ద షాకిచ్చిన చెన్నై బ్యూటీ!

చెన్నై బ్యూటీ త్రిష త‌న కొడుకును తాజాగా అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. త‌న‌యుడితో దిగిన క్యూట్ ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పెళ్లి కాకుండా త్రిష‌కు కొడుకు ఎక్క‌డ నుంచి వ‌చ్చాడు అని అనుకుంటూ షాక్ అవుతున్నారా.. త్రిష ప‌రిచ‌యం చేసింది రియ‌ల్ కొడుకును కాదు రీల్ కొడుకును.

ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2` లో కుందువై పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న త్రిష‌.. ప్ర‌స్తుతం త‌మిళంలో ‘ది రోడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ వశీక‌ర‌ణ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏఏఏ సినిమా ప్ర‌వేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే త‌మిళ్‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

అయితే తాజాగా త్రిష ఈ చిత్ర సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. చంటిబిడ్డను ఎత్తుకొని త్రిష మురిసిపోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ ను చూస్తుంటే.. ది రోడ్ సినిమాలో ఆమె ఓ బిడ్డ‌కు త‌ల్లిగా క‌నిపించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ ఫోటోల‌ను చూసిన అభిమానులు.. త్రిషకు కూడా పెళ్లి అయ్యి ఉంటే ఇలాంటి బిడ్డ ఆమెకు ఉండేవాడు అని అభిప్రాయపడుతున్నారు. కానీ, త్రిష మాత్రం నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి ఊసు ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest