పెళ్ల‌యిన అమ్మాయితో స‌ల్మాన్‌ఖాన్ ఎఫైర్‌… ఇన్నాళ్ల‌కు వెలుగులోకి వ‌చ్చిన నిజం…!

మైనే ప్యార్ కియా సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ.. ఇదే సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్‌ వంటి పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వారితో పంచుకుంది.

Before Salman Khan, this actor was offered 'Maine Pyar Kiya'

సల్మాన్‌తో నటించిన మేనే ప్యార్ కియా సినిమా తనకు విజయంతో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా తీసుకొచ్చిందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఈ సినిమా విడుదల‌య్యాక స‌ల్మాన్‌తో ఎఫైర్ నడుస్తుందని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అదే సమయంలో పలు పత్రికలు వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా రాసుకు వచ్చాయి. ఇక ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఈమె స్పందిస్తూ ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చింది.

Bollywood Actress Bhagyashree Shares Relation Affairs With Salman Khan -  Sakshi

భాగ్యశ్రీ ఈ విషయంపై మాట్లాడుతూ.. నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత ప్రతిరోజు నన్ను కలవడానికి మహిళా రిపోర్టర్ వచ్చేవారు.. నాకు విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఎప్పుడూ ఓ ప్రశ్న అడిగి వెళ్ళేది.. సల్మాన్ ఖాన్ తో మీ భార్య రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ఆమె ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్‌ మ్యాగజైన్స్‌ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.’ అని అ‍న్నారు.

సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేస్తేనే కౌగిలించుకున్నా.. నటి కామెంట్స్ వైరల్ |  star actress bhagya sree comments about salman khan, bhagya sree, salman  khan, salman khan request, interesting facts ...

అంతేకాకుండా సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ‘మైనే ప్యార్‌ కియా’ విడుదలైన కొంతకాలానికి నా చిన్ననాటి స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నాను.. పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ అతి తక్కువ సినిమాల్లోనే నటించారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్ సినిమాతో మరోసారి తెలుగు తెరపై సందడి చేశారు. ఇలా గతంలో తనపై వచ్చిన ఆరోపణకు భాగ్యశ్రీ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

Share post:

Latest