దయచేసి నన్నలా పిలవకండి: ఐశ్వర్య రాజేశ్‌

తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌. ఐశ్వర్య అందం, నటన గురించి అందరికీ తెలిసిందే. కెరీర్‌ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఎక్కువశాతం మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫర్హానా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి విదితమే.

కాగా యధావిధిగా ఈ సినిమాలో కూడా ఐశ్వర్యరాజేష్‌ తన నటనతో మెస్మరైజ్ చేసేసింది. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమాను వీక్షించి బయటకొచ్చిన ఐశ్వర్య రాజేష్‌ను చూసిన అభిమానులు సూపర్‌స్టార్‌ సూపర్‌స్టార్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో అమ్మడు వీటిపై… నన్ను అలా బిరుదులతో పిలవొద్దు. మనకు ఉన్న సూపర్‌స్టార్‌ ఒక్కరే. ఆయనే రజనీకాంత్‌. నేను కూడా రజనీ సర్‌ వీరాభిమానిని. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

అంతే కాకుండా, ‘సూపర్‌స్టార్‌’ అని పిలిపించుకునే అర్హత ఆయనొక్కరికే ఉంది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమిళ చిత్ర సీమలో సీనియర్‌ నటి నయనతారను కూడా ఆమె అభిమానులు ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాజేష్‌ కామెంట్స్‌ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె మాటలకు నయనతార అభిమానులు కూడా నొచ్చుకున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ‘ఫర్హానా’ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ ముస్లిమ్‌ అమ్మాయి పాత్రలో కనిపించిన సంగతి అందరికీ తెలిసినదే.

Share post:

Latest