పాపం..చిన్న రీజన్ తో మహేశ్ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. ఆ మూవీ ఇదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సాయిపల్లవి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనందరికీ తెలిసిన విషయమే . ఫిదా సినిమాతో తెలుగు కుర్రాలను ఫిదా చేసేసిన సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఎంతలా అంటే స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెతో సినిమాలు తీయ్యాలని ఈగర్ గా వెయిట్ చేసే అంతలా సాయి పల్లవి తన రేంజ్ ని మార్చేసుకుంది .

అయితే ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది సాయి పల్లవి ఆలోచన.. అందుకే ఎంత రేంజ్ లో క్రేజ్ వచ్చిన సరే ఆమె ఏనాడు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు . రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సాయి పల్లవి చాలా మొండిది ..కథ విషయంలో ..కంటెంట్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగిన సరే సినిమా రిజెక్ట్ చేసి పడేస్తుంది.

అలా తెలివి తక్కువ తనంతో సినిమా రిజెక్ట్ చేయడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మరో హీరోయిన్ ఖాతాలో పడడం సాయి పల్లవి అభిమానులకు మింగుడు పడటం లేదు. మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “సరిలేరు నీకెవ్వరు”. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా ఎలాంటి హ్యూజ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పెట్టిన దానికి ట్రిపుల్ రేంజ్ లో లాభాలు తీసుకొచ్చి అనిల్ రావిపూడి కి మహేష్ బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో అనిల్ రావిపూడి మొదట రష్మిక పాత్రలో అనుకున్న హీరోయిన్ సాయి పల్లవి ని అంటూ ఓ న్యూస్ బయటపడింది. అయితే సాయి పల్లవి ఈ సినిమాలో కేవలం హీరోయిన్ పాత్ర పాటలకి .. రొమాన్స్ కి మాత్రమే అంకితం అయిందన్న కారణంతో రిజెక్ట్ చేసేసిందట. దీంతో ఆ తర్వాత రష్మిక ని చూస్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి . ఇలా మంచి ఆఫర్ చేతులారా మిస్ చేసుకునింది సాయి పల్లవి . కేవలం ఇదే కాదు ఇంకా బోలెడు సినిమాలు చిన్న కారణంతోనే మిస్ చేసుకుంది.

Share post:

Latest