మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం మతిపోగుడుతున్న ఆలియా భట్ ఫోజులు..!

ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌కి జంటగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇక మ్యాగజైన్ పేజీలకు అదిరిపోయే ఫోజులు ఇస్తూ రెచ్చిపోతుంది. ఇంద్రధనస్సు రంగులతో మెరిసినట్లు రకరకాల రంగు దుస్తులలో మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.

తల్లి అయిన తరువాత దాదాపు రెండేళ్ల వరకూ కెమెరాకు దూరంగా ఉండాలి అనుకుంది అలియా. కానీ ఈ ఫోటో షూట్స్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన లక్ష ముత్యాల డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇప్పుడేమో అరబ్ బజారు మ్యాగజైన్ కోసం అందంగా ముస్తాబైంది. నిజం చెప్పాలంటే అలియాకు పెళ్లి పిల్లల తరువాతనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అయితే అలియా బ్రేక్ తీసుకోవాలి అనుకుంది కేవలం సినిమా ల నుండి మాత్రమే. ఇలాంటి ఫోటో షాటోస్ తో ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సినిమాల కోసం అయితే నెలల తరబడి సంవత్సరాల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాలి.

ఈమధ్య మెట్ గాల వేడుకకు వెళ్లిన అలియా ఒక నాలుగు రోజులు కూడా తన కుతుర్ని విడిచి ఉండలేకపోయిందట. కూతుర్ని బాగా మిస్ అవుతున్నానని చెప్తూ మీడియా ముందు కంట తడి కూడా పెట్టింది. ఇంకోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా కూతురితో టైమ్స్ స్పెండ్ చెయ్యడం కోసం మొన్నటివరకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని ఇటీవలే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాడు.

 

Share post:

Latest