టాలీవుడ్‌కు బదిలీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాశి. ఈ సినిమా కన్నా ముందే చిత్ర పరిశ్రమలో బాలనటిగా పరిచయమైంది. మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో రాశి స్టార్ హీరోయిన్‌గా మారింది. రాశీ కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్, విలన్ పాత్రలో కూడా నటించి తన క్రేజ్‌ను తగ్గించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది.
రాశి సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. రాశీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్న వయసులోనే మూడు పెళ్లిళ్లు చేసుకునీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీనివాసును పెళ్లి చేసుకుని ఒక పాపతో హ్యాపీగా తన లైఫ్ కొనసాగిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే గతంలో చిత్ర పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పి ఆ తర్వాత మళ్లీ నట కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన సందడే సందడి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది రాశి.
ఈ సినిమా తర్వాత వరుసుగా శ్రీరామచంద్రులు, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమాలతో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది. ఇలా వరుసగా వీరిద్దరూ కలిసి నటించడంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే వీరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్న ఇండస్ట్రీ జనాలు రాశికి రాజేంద్రప్రసాద్ తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో ప్రచారం చేశారు.
ఇక ఈ ఎఫైర్ వార్తలతో చాలామంది రాశి క్యారెక్టర్ మంచిది కాదంటూ ఆమెకు అవకాశాలు లేకుండా చేశారు. దాంతో ఆ వార్తతో విసిగిపోయిన రాశి ఎలాగైనా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని భావించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమైంది.