డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన చిత్రం ఫర్హనా. ఈ సినిమాలో నటించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. దీంతో తాజాగా ఇమే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసులు బాధ్యత ఏర్పాటయింది.. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకూడదు అని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫర్హనా సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించడం జరిగింది.
ఐశ్వర్య రాజేష్ బుర్కా ధరించి ప్రపంచవ్యాప్తంగా ప్రాస్టిట్యూషన్ నిర్వహించే పాత్రలో నటించింది. దీంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. సదరు వర్గం ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది..ఫర్హనా సినిమా గురించి కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం మాట్లాడడం జరిగింది.. కొంతమంది మాత్రమే ఫర్హనా చిత్రం పైన వివాదం చేస్తున్నారు. అది కూడా ఇండియన్ సెన్సార్ బోర్డ్ అనుమతి తెలిపిన ఈ సినిమా వివాదం చేయడం చాలా బాధగా ఉందంటూ తెలిపింది.
మా చిత్రం ఏ మతానికి నమ్మకాలకు వ్యతిరేకం కాదు ఓ మంచి సినిమా చేయాలన్నది మా లక్ష్యం.. ఒక మతానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు సినిమాలు చేశాము మానవత్వాన్ని చాటే సినిమాలను మాత్రమే మేము చేస్తున్నామని తెలిపారు.ఫర్హనా సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, ఐశ్వర్య దత్త, జినిత్ రమేష్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ది కేరళ స్టోరీ సినిమా లాగే పలు వివాదాలలో చిక్కుకుంటోంది..ఫర్హనా సినిమా కారణంగా ఐశ్వర్య రాజేష్ పైన ఎలాంటి ప్రభావం చూపుతోందో చూడాలి..