బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `క‌స్ట‌డీ`.. చైతు మూవీకి ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

అక్కినేని నాగచైతన్య ఖాతాలో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ వ‌చ్చి ప‌డింది. రీసెంట్ గా ఈయ‌న `క‌స్ట‌డీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది.

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ ల‌భించింది. అక్కినేని అభిమానులు కూడా క‌స్ట‌డీపై పెద‌వి విరిచారు. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. సోలోగా వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఏకంగా రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో క‌నీసం ఆరు కోట్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.17 కోట్ల రేంజ్ లో వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 5.83 కోట్ల షేర్ తో స‌రిపెట్టుకుంది. ఇక‌ ఈ సినిమాకు అటు ఇటుగా రూ. 18 కోట్ల రేంజ్‌లో న‌ష్టం వాటిల్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ విష‌యం తెలిసి నోరెళ్ల‌బ‌డుతున్నారు నెటిజ‌న్లు.

Share post:

Latest