చేతుల్లారా బంగారం లాంటి ఆఫర్ ని వదులుకున్న నీహారిక.. ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా జొన్నల గడ్ద చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో అమ్మడు కూడా ఇలాంటి వార్తలు పై నెగిటివ్గా స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అనుకుంటున్నారు జనాలు. కాగా రీసెంట్గా నిహారిక డేడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సిరిస్ యావరేజ్ టాక్ దక్కించుకుంది . ఇలాంటి క్రమంలోనే నిహారిక గతంలో ఓ సినిమాని మిస్ చేసుకునింది అన్న న్యూస్ మరోసారి వైరల్ గా మారింది . ఒక మనసు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక .. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . అయితే హీరోయిన్గా సక్సెస్ కాలేదు నిహారిక . అయితే ఒక్క మనసు చిత్రంకన్నా ముందే..అమ్మడు కి బంగారం లాంటి అవకాశం వచ్చిందట. అది చేతుల్లారా మిక్స్ చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ నిహారిక మిస్ చేసుకున్న సినిమా ఏదో తెలుసా..”నేను శైలజ”. ఇందులో ముందు నిహారికను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఇంట్లో వాళ్లతో మాట్లాడి చెప్తా అని దాదాపు నెల రోజుల పైగానే టైం తీసుకుందట . రోజులు గడిచిపోతున్నా నిహారిక ఆన్సర్ ఇవ్వకపోవడంతో..మేకర్స్ వేరే వాళ్ళని తీసుకున్నారు . కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఎంతటి క్రేజ్ స్దానాన్ని సంపాదించుకుందో తెలిసిందే. ఒకవేళ నిజంగా నిహారిక ఈ పాత్ర చేసుంటే అమ్మడు కూడా ఇప్పుడు ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉండేది అంటూ మెగా ఫాన్స్ ఫీల్ అయిపోతున్నారు. ఏది ఏమైనా సరే నీహారిక మాత్రం చేతులారా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది..!!

Share post:

Latest