సైడ్ బిజినెస్‌లో లాభాలు ఆర్జిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..

ప్రస్తుతం కాలంలో చాలామంది తాము చేసే పని కాకుండా సైడ్ బిజినెస్‌లు పెట్టి కలిసి సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కేవలం సాధారణ ప్రజలే కాకుండా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని సైడ్ బిజినెస్‌లో ఉపయోగిస్తూ రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలామంది సైడ్ బిజినెస్‌లతో ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. చాలావరకు ఫుడ్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.

అయితే ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా సైడ్ బిజినెస్‌లు మొదలు పెట్టారు. ఇప్పటికే సమంత దుస్తులకు సంబంధించిన బిజినెస్ చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. ఇక ఇప్పుడు మరి కొంతమంది హీరోయిన్లు సైడ్ బిజినెస్‌లతో డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. వారు ఎవరో, అవేం బిజినెస్‌లో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• కీర్తి సురేష్:

మహానటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఇటీవల ఆమె నటించిన దసరా సినిమాలో వెన్నెల పాత్రతో ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు సినిమాల పరంగానే కాకుండా వ్యాపారంలో కూడా బాగా డబ్బు సంపాదిస్తుంది. కీర్తి సురేష్ ‘భూమిత్ర’ అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్‌ని నడుపుతుంది.

• కాజల్ అగర్వాల్:

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. పెళ్లయి ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తూనే ఉంది. కాజల్ అగర్వాల్ తన చెల్లి నిషా అగర్వాల్ కలిసి ఒక ఫ్యాషన్ జువెలర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు.

• రకుల్ ప్రీత్ సింగ్:

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌కి దూరమై బాలీవుడ్‌లో సెటిల్ అయింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అయితే రకుల్ కూడా తన సొంతంగా ఫిట్నెస్ హెల్త్‌కు సంబంధించిన జిమ్ సెంటర్‌ను ప్రారంభించినట్టు సమాచారం. ఇలా చాలామంది హీరో హీరోయిన్లు సినిమాల్లో వచ్చే డబ్బును పెట్టుబడిగా పెట్టి తమ సొంత బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.

Share post:

Latest