ఊర్వశి రౌటేలా మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న‌‏ ఫ్రాన్స్ లో అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల‌ 27 వరకు జరగనున్నాయి. ప్ర‌తి ఏడాది జరిగే ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్ పై హొయలు పోతుంటారు.

ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా రోజుకో వెరైటీ డ్రస్సులో అందరినీ ఆకర్షిస్తోంది. మొదటి రోజు పింక్ టల్లే గౌను ధరించి మెడ‌లో మొసలి నెక్లెస్, చెవులకు మొసలి రింగులు పెట్టుకుని అందంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే ఆమె ధ‌రించిన ఆభ‌ర‌ణాలు న‌కిలీవి అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఈ విష‌యంపై ఆమె టీమ్ స్పందించింది.

ఊర్వశి రౌటేలా ధ‌రించిన ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని.. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుందని.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం అని పేర్కొంది. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ‌ర్చ‌పోతున్నారు. మ‌రికొంద‌రేమో ఈ విష‌యాన్ని న‌మ్మ‌కుండా సెటైర్లు పేలుస్తున్నారు. అంత సీన్ లేదు, జోక్ బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఊర్వ‌శి రౌటేలా ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు హొయలొలికించింది. తొలి రోజు నుండి అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌తో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

Share post:

Latest