అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబెట్టిన చైతన్య.. నాగార్జుననే వేస్ట్??

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున నటించనున్నాడు. ఇప్పటికీ అక్కినేని నాగార్జున పారితోషికం రూ.10 కోట్లకు మించి పెరగలేదు.

అయితే ఈ మధ్య నాగార్జున కేవలం అక్కినేని హీరోల ఈవెంట్స్ కు మాత్రమే హాజరవుతున్నారు. వేరే హీరోల కుటుంబాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలకి నాగార్జున వెళ్లడం లేదు. తండ్రి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ నాగచైతన్య మాత్రం అన్నిచోట్ల పాల్గొంటున్నాడు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి హాజరయ్యి ఎన్టీఆర్ గురించి అద్భుతంగా మాట్లాడాడు. ఈ విషయంలో నాగార్జున కంటే నాగచైతన్యనే వంద రెట్లు బెస్ట్ అని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దాంతో నాగచైతన్య నెక్స్ట్ సినిమాలపై కూడా అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.

అక్కినేని కుటుంబ పరువు నాగచైతన్య నిలబెడుతున్నాడని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమందేమో నాగచైతన్య కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా అక్కినేని హీరోలు స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో నటిస్తే వారికే బాగుంటుందని మరికొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతం అక్కినేని హీరోలను అభిమానించే వారి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. సినిమా రిజల్ట్స్ ని ఆలోచించకుండా అక్కినేని కుటుంబానికి క్రేజ్ పెరుగుతూ పోతుంది.

 

Share post:

Latest