ఓటిటిలోకి వచ్చేస్తున్న రామబాణం.. ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ చిత్రంలో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది అలాగే కుష్బూ ,జగపతిబాబు, నాజర్ ,వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాకు రావడం జరిగింది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్తో తెరకెక్కించిన ఈ చిత్రం గోపీచంద్ అభిమానులను అలరించినప్పటికీ సగటు ప్రేక్షకుడను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ గోపీచంద్ యాక్షన్ సీక్వెల్ డింపుల్ అందాలు ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చాయి.

Ramabanam OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న గోపీచంద్ రామ‌బాణం -  స్ట్రీమింగ్ ఎప్పుడంటే-gopichand ramabanam ott release date fixed
బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది ప్రేక్షకులు తాజాగా ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.. థియేటర్ రిలీజ్ కు ముందు దాదాపుగా రూ .8 కోట్లకు గోపీచంద్ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ దక్కించుకున్నట్లు సమాచార. గతంలో గోపీచంద్,శ్రీ వాస్ కాంబినేషన్ల లక్ష్యం, లౌక్యం సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. థియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న రామబాణం సినిమా వచ్చేనెల 1 లేక 3వ తేదీలో ఈ సినిమా సోనీ లీవ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది.

థియేటర్లో విడుదలైన నాలుగు వారాల లోపే రామబాణం సినిమా కూడా ఓటీటి లోకి వచ్చేస్తుందన్నమాట. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం రామబాణం సినిమాలో గోపీచంద్ జగపతిబాబు అన్నదమ్ములుగా నటించారు. థియేటర్లో రామబాణం మిస్సయిన వారు ఇక ఓటీటి లో చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు.

Share post:

Latest